Radhe shyam telugu movie | prabhas | pooja hegde | pan india | success meet | krishnam raju daughter praseeda interview

 అన్నయ్య ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా ఇమేజ్‌ నుంచి ప్యాన్‌ వరల్డ్‌ ఇమేజ్‌ పొందడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. నేను నిర్మాణరంగంలో అడుగుపెట్టాలనుకున్నప్పుడు చాలా భయపడ్డా. దానికి సంబంధించి.. నా నేపథ్యం ఏంటో ఎవరికీ చెప్పకుండా ముంబైలో కొన్నాళ్లు ప్రొడక్షన్‌లో పని నేర్చుకున్నా. అయితే నా వెనుక అన్నయ్య, నాన్న ఉన్నారని ధైర్యంగా ముందుకెళ్లా’’ అని కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీధ అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ చిత్రంతో ప్రసీధ నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ నాకు నిర్మాణరంగం అంటే ఇష్టం. ఒక ఐడియాను సినిమాగా ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచన నాకు నచ్చింది. ప్రొడక్షన్‌ గురించి అంత అవగాహన లేదు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి వుండేది. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వల్లనా లేదా నిజంగా ప్యాషన్‌ ఉందా అన్నది తెలుసుకోవడానికి ముంబై వెళ్లి అక్కడ ఓ సినిమాకు పూర్తి స్థాయిలో ప్రొడక్షన్‌ రంగంలో పనిచేశా. రోజుకి 18గంటలు పనిచేసేదానిని. అప్పుడు నాకు అర్థమైంది సినిమా మీద నాకున్నది ప్యాషన్‌ అని. మొదట అమెరికాలో కోర్స్‌ చేశా. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్ష్‌లో పని చేశాను. ఈ భారీ చిత్రంతో నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. 

నేను వంట బాగా చేస్తా. అన్నయ్యకి చాలా సార్లు వంటలు చేసి పంపిస్తాను. చిన్నప్పుడు అన్నయ్యకి ఓరియో చీజ్‌ కేక్‌ చేసి పెట్టేదాన్ని. చాలా ఇష్టంగా తినేవారు. మా అన్నయకి ఎక్సయోటిక్‌ వంటకాలంటే ఇష్టం. కొత్తగా ఏదైనా వండినప్పుడు పంపుతుంటా. నచ్చితే మళ్ళీ పంపమని అడుగుతారు.


Comments

Popular posts from this blog

Adipurush .आदिपुरुष. prabhas bollywood Release in 20 thousand screens in the world? hindi news

Radhe Shyam review, rating 2.9